ఇప్పుడు మన ముందుకు ఒక మెడికల్ ఎమర్జెన్సీ సమస్య వచ్చింది. మన పక్కనే ఉన్న నాగులాపల్లిలో.. ఇప్పటికే ఒక బిడ్డను పోగొట్టుకొన్న.. ఆ తల్లిదండ్రులకు పుట్టిన రెండో మగబిడ్డ.. మొన్నటి వరకూ..కేరింతలు కొడుతూ.. నవ్వులు పూయిస్తూ..ఆటలాడిన.. రెండేళ్లు కూడా నిండని ఆ చిన్నారి కేశవ.. గత కొన్ని రోజులుగా ఆసుపత్రి మంచంపై, ఆయువు కోసం పోరాటం చేస్తున్నాడు. లివర్ ఇన్ఫెక్షన్, నిమోనియా తో కూడిన ఎనీమియా, బోన్ మారో వంటి పెద్ద పెద్ద పేర్లు, ఆ తల్లిదండ్రులను మరింత భయపెట్టి అగాధంలోకి నెట్టేసాయి. ప్రైవేట్ స్కూల్ లో ఉద్యోగిగా.. తాను సంపాదించిన చివరి రూపాయి వెక్కిరిస్తూ వెళ్లిపోయి చాన్నాళ్ళయినా, కనీసం ఈ బిడ్డనైనా బ్రతికించుకోవాలన్న ఆశ.. అప్పులెన్నో చేయించింది. చేయి చాచి ఎవరినీ అడగలేక.. చేతులారా.. బిడ్డని అలా వదలలేక.. దొరికిన చోటల్లా.. అప్పులు చేశారు.. అయినా, ఏం లాభం? ఒళ్లంతా కాలిపోతూ.. ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నాడు విజయవాడ రెయిన్ బో ఆసుపత్రి లో.. ఆ చిట్టి చిన్నారి.

Blood Login Fund