ఇప్పటివరకు మనం..

ఆకలి అన్నవారికి ఆకలి తీర్చాo..

అవసరం అన్నవారికి ఆసరా నిచ్చాం...

ఆయువు అన్నవారికి ఊపిరినిచ్చాం...

ఇవి వేరు వేరు వ్యక్తులకు చేశాం... కానీ ఇప్పుడు... మొదటిసారిగా... ఆకలి.. అవసరం.. ఆయువు.. ఒకే ఒక వ్యక్తికి అవసరం.. ఆ వ్యక్తి...ఒంటరి.. నా అన్నవాళ్ళు లేని అనాధ... అలాంటి మిత్రునికి.. నీకేం కాదంటూ.. మేమున్నాం నీకంటూ.. ఆయువు పోయడానికి టీమ్ సంకల్పం చేస్తున్న మహా సమరం.. 🙏 దైవమా ఇది నీకు న్యాయమా...🙏

అందమైన బాల్యాన్ని చిదిమేశావ్.. లాలించే అమ్మని దూరం చేశావ్... పాలించే నాన్నని కూడా నీ వద్దకే తీసుకుపోయాయ్... ఒంటరితనాన్ని బహుమతిగా ఇచ్చావ్... నా అన్న వాళ్ళని చుట్టూ చేరకుండా చేసి అతన్ని అష్ట దిగ్భంధనం చేశావ్.... అయినా సరిపోలేదా నీ ఆటకు...? పదేళ్ల ప్రాయం నుండీ... వెంటాడే ప్రతీ కష్టం... వెనక్కి లాగుతున్నా..

దాతలసహాయంతో...చదువుకుంటూ... ఇంటర్మీడియట్లో 90 శాతం మార్కులు తెచ్చుకుని డాక్టర్ కావాలనుకుని కలలు కనేవాడు.. సరిగ్గా అలాంటి వేళ... రెండు కిడ్నీలను నాశనం చేసి... కనికరం లేకుండా నీవాడిన ఆటలో... రెక్కలు తెగిన విహంగంలా మారి మంచానికి పరిమితం అయ్యాడు... దాతలు జాలి తలచి పెట్టే... ఒక పూట భోజనాన్ని రెండు పూటలా సర్దుకుని తింటూ... వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకుంటూ... నా అన్న వాళ్ళు తోడు లేక.. రోజులు లెక్కబెడుతున్నాడు.... చస్తూ బ్రతుకీడుస్తున్నాడు... ఈయన కష్టాన్ని చూసి... ఆ కష్టానికి కూడా కన్నీళ్లు వచ్చాయేమో..?జీవన్ దాన్ సంస్థ ద్వారా కిడ్నీ అందించేలా ఏర్పాటు చేసింది... కానీ తొండి ఆట ఆడుతున్న ఆ దైవం ఈసారి మరలా ఆపరేషన్ కోసం అవసరం అయిన అతి పెద్ద భారాన్ని అతని ముందు ఉంచింది... సమయం లేదు మిత్రమా... కేవలం ఎనిమిది అంటే.. ఎనిమిదే రోజుల కాలం.... కావాల్సింది ఆరు లక్షల రూపాయలు...

🙏 సహచర సంస్థలు చేస్తున్న ప్రయత్నాలతో మనం కూడా అడుగేద్దాం... పోరాడదాం మిత్రమా.... ఒంటరితనం అతన్ని నుండి దూరంగా పారిపోయేదాకా....! కష్టం అతన్ని వదిలి పరుగులు తీసేదాకా..!! మన వల్ల ఏమి కాదులే అనుకోకు మిత్రమా.... వందల గడ్డి పోచలు పెనవేస్తే మదపుటేనుగుని కూడా బంధించగలవు.... ప్రాణాలు నిలపడానికి సాచిరునామా..ఈ యజ్ఞంలో నేను సైతం అంటూ అడుగులు వేసే మానవ దైవాల కోసం ఎదురుచూస్తూ..🙏

■■■■■■■■■■■■■

పేరు: అనుములపూడి గణేష్

సమస్య : శస్త్ర చికిత్స చేసి కిడ్నీ మార్పిడి చేయడం

అంచనా వ్యయం: 6 లక్షలు

■■■■■■■■■■■■■

Image Gallery

పాఠశాల -

Blood Login Fund