నమ్రత శ్రీ
ముక్కుపచ్చలారని ఐదేళ్ల చిన్నారి అమితమైన ప్రేమను పంచే నాన్న, అపర కుబేరుడు కాదు.. పని కోసం ఖమ్మం నుండి, నెల్లూరు వెళ్లి.. రోజు కూలీకి వెల్డింగ్ పనిచేస్తున్న నిరుపేద జీవితం..
ఆ అమ్మా, నాన్నకు.. ఒకటే ప్రపంచం.. ఒకటే ప్రాణం.. అదే తమ చిన్నారి నమ్రత శ్రీ.. కానీ, సరిగ్గా 7 నెలల క్రితం.. అనుకోని కుదుపు, ఆ అందమైన కుటుంబాన్ని తలక్రిందులు చేసింది.. చిన్నారి నవ్వులు ఏమయ్యాయో గానీ, కన్న వారి రోదన మాత్రం కన్నీరై పారుతుంది.. ఆ పసి ప్రాణం Fanconi Anemia అనే వ్యాధితో.. చెన్నై ఆసుపత్రిలో చికిత్స కోసం ఎదురుచూస్తుంది.
ఇప్పుడా చిన్నారికి బోన్ మారో ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి.. కళ్లళ్ళో పెట్టుకొని పెంచుకొంటున్న కన్నకూతురి కోసం.. డోనార్ గా తండ్రి ముందుకు వచ్చాడు.. డోనార్ కి, చిన్నారికి జరిగే.. ఈ ఆపరేషన్లకు అయ్యే ఖర్చు సుమారు 15 లక్షల రూపాయలు.
అవసరం కొండలా ఉంది.. అడుగు మాత్రం కాలి క్రిందనే ఉంది.. ఆ అడుగుకి ఆసరాగా ఉందాం.. ఆ తండ్రిని ముందుకు నడిపిద్దాం.. తల్లడిల్లుతున్న ఆ అమ్మకి.. నలిగిపోతూ నరకాన్ని అనుభవిస్తున్న ఆ నాన్నకి మనం ధైర్యం పంచుదాం.
మనమిచ్చే వందతో ఏమవుద్దిలే అనుకోవద్దు.. అలాంటి వందలతో.. ఎన్నో ప్రాణాలను నిలబెట్టాము.. ఇప్పుడు కూడా.. మనమిచ్చే రూపాయి.. ఆ చిన్నారికి మరిన్ని ఊపిరిలు పోస్తుంది.. అందులో, ఏదో ఒక ఊపిరి ఆ చిన్నారిని బ్రతికిస్తుందన్న ఆశతో మన ప్రయత్నం మనం చేద్దాం.. 🙏🙏🙏🙏🙏