జరిగింది.. చాలా భాధాకరమైన సంఘటన.. ఒక్కసారిగా... కట్టుబట్టలు.. ఉండే ఇల్లు.. దాచుకొన్న వస్తువులు.. కూడబెట్టిన చిల్లర.. కళ్లముందే బూడిద అయిపోయాయి. ఈ చలిరాత్రుల్లో... వాళ్ల దీనస్థితి తలుచుకొంటేనే.. బాధేస్తుంది. ప్రతీ సమస్యకూ... ధనమే ఇవ్వాల్సిన అవసరం లేదు.. ఎవరైనా ధన సాయం చేస్తే... వాటిని వస్తు రూపంలోకి మార్చి ఇస్తేనే ఉపయోగకరమని నా అభిప్రాయం. వారికిప్పుడు.. బియ్యం, పప్పులు, బట్టలు, వారి పిల్లలకి పుస్తకాలు ఏదైనా అవసరమే!! ఏం చేస్తే బాగుంటుందో మీరే ఆలోచించండి.. సమస్య అనగానే సాయం చేసే మీకు... నిర్ణయాలూ తీసుకొనే అధికారం కూడా ఉంది. నల్లగ మసి బారిపోయే ఆ చక్కని ఇల్లు! బొగ్గు ముక్కలను చూసి నీరుగార్చే కళ్లు!! ఒక్క రేయి లోనే వీధి పాలయ్యే బ్రతుకు! ఎట్టా దొరికేనో బిడ్డ కడుపు నింపే మెతుకు!!