మనవరాలిని కాపాడుకోవాలన్న ఒక ఆటో డ్రైవర్ ఆరాటం ఇది.... నిండా పది నెలలు నిండని పసికందుని బతికించుకోవడం కోసం దవాఖాన అంటే ఏమిటో తెలియని తల్లిదండ్రులు చేస్తున్న పోరాటం ఇది... పాల బుగ్గల పసిదాని ప్రాణం కోసం టీమ్ సంకల్పం చేస్తున్న మరో ఆశల యజ్ఞమిది... సరిగ్గా 12 నెలల ముందు నలతగా ఉందని తల్లి ఆసుపత్రికి వెళ్తే పరీక్ష చేశారు... పెద్దగా ఇబ్బంది ఉండదు అన్నారు.. ఈలోగా కరోనా ఊపందుకోవడంతో ఆసుపత్రికి వెళ్లలేకపోయారు... సరిగ్గా పది నెలలు అయ్యేసరికి ఆ తల్లికి తెల్సింది..తన చిన్నారికి రెండు కిడ్నీలు పని చేయవు అని.. పచ్చ నోట్ల వెంట పరుగులు పెడితే కానీ తగ్గని మాయ రోగం అదీ అని...🙏🏻 ■■■■■■■■■■■■■ సమస్య వివరాలు ■■■■■■■■■■■■■ పేరు : యన్. బివుల వయసు : 10 నెలలు సమస్య : కిడ్నీ చికిత్స కొరకు అంచనా వ్యయం : 2 లక్షల 50 వేలు అందించిన సహాయం : 73 వేలు ■■■■■■■■■■■■■