విషాదకరమైన సంఘటన లివర్ వ్యాధితో బాధపడుతున్న మన నీలం శ్రీనివాసు గారు ఇక లేరు ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య తీవ్రమైన అనారోగ్యం... ఆపైన పేదరికం... కూతురి పెళ్లి అయ్యి నెల కూడా దాటలేదు.. ఆరోగ్యం కోసం లక్షలు ఖర్చు అవుతూంటే... కుటుంబానికి భారం అనుకొన్నాడో... ఏమో.. బయటికి వెళ్లిన మనిషి... రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకొన్నాడన్న విషయం పోలీసుల సమాచారంతో తెలిసింది. ఏది జరక్కూడదని మనం తాపత్రయ పడుతున్నామో... అదే జరిగిపోయింది... ఒక కుటుంబం అనాధ అయిపోయింది. రేపు 11 గం.కి మృతదేహాన్ని పోలీసులు అందిస్తారని సమాచారం. ఇంటిలో యజమాని కన్నుమూస్తే... చేతిలో పైసా లేని పరిస్థితి. వైద్యానికి సేకరించిన మొత్తం... అంత్యక్రియలకి అందించవలసిరావడం దురదృష్టకరం... విషయం తెలిసినప్పటి నుండీ.. ఎలా స్పందించాలో తెలియని స్థితి... భవిష్యత్తులో.. ఆ కుటుంబానికి, ఆయన కుమారుడి కెరియర్ కి ... ఎంతోకొంత... అండగా ఉండడానికి ప్రయత్నిద్దాం...