ఎక్కడో మట్టి గోడల మధ్య, ఇరుకు గదుల్లో, ఊపిరికూడా సరిగా అందని చోట.. లేచి నాలుగు అడుగులు వేయడానికి ఒక్క అడుగూ స్థలం కానరాని చోట.. నిత్యం ఆ మంచం మీదనే ఉంటూ, పెట్టింది తింటూ. కాలం వెళ్లదీస్తున్న 20 మంది పెద్దవారికి. మీ అందరి సహకారంతో రెండు నెలల ముందు ఒక బృందావనం లాంటి... సుమారు 700 గజాల స్థలం మధ్యలో.. ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని. ఆ ఇంటికి మరమ్మత్తులు చేయించి, పెద్దవారికి అవసరమయ్యేట్టు బాత్రూమ్ లు మార్చి., ఇంటి చుట్టూ అందమైన మొక్కలు, సిమెంట్ బెంచీలు వేసి.. వారికి ఆహ్లాద మైన వాతావరణం అందించడం జరిగింది. సంకల్పం సైనికుల సహాయంతో విశాలమైన, ఆహ్లాద వాతవారణం తో కూడిన సంకల్పం ఆనంద నిలయం (లీజ్ కి తీసుకోబడిన ఇల్లు) లో కి 03 Dec 2021 న మార్చటం జరిగింది. ఆ ఇంటికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత.. వారు సంకల్ప సభ్యులకు చెయ్యెత్తి నమస్కరిస్తూ.. ఒక్కటే మాట అన్నారు.. మీ అందరి వలన, మా అందరికీ మరో పదేళ్లు ఆయుష్షు పెరిగిందయ్యా.. మీ కుటుంబాలన్నీ చల్లగా ఉండాలి - అని. ****